Pradeep Kasappa Nayak: ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Bus Conductors Misconduct Caught on Video Pradeep Kasappa Nayak Arrested
  • మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • కండక్టర్ ప్రదీప్ ను అరెస్టు చేసి జైలుకు తరలించిన పోలీసులు
  • విధుల నుంచి సస్పెండ్ చేసిన కెఎస్ఆర్టీసీ అధికారులు
ఓ ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బస్సు కండక్టర్ అడ్డంగా బుక్ అయ్యాడు. బస్సులో నిద్రపోతున్న ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో సదరు కండక్టర్ నీచపు పనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఈ ఘటన జరిగింది. ముడిపు నుంచి మంగళూరు నగరానికి వస్తున్న బస్సులో కండక్టర్ ఈ నీచపు పనికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బస్సు కండక్టర్ ప్రదీప్ కశప్ప నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద ప్రదీప్‌పై కేసు నమోదు చేశారు.

నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంపై కెఎస్ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రదీప్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. విచారణ త్వరగా పూర్తి చేసి సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కెఎస్ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. 
Pradeep Kasappa Nayak
Mangalore Bus Conductor
Karnataka KSRTC
Viral Video
Misconduct
Sexual Harassment
Arrest
Suspended
Social Media

More Telugu News