A.R. Rahman: పిటిషనర్‌కు రూ. 2 కోట్లు చెల్లించండి.. రెహమాన్‌ను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court Orders AR Rahman to Pay Rs 2 Crore
  • ‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమాలోని పాటపై కాపీరైట్ కేసు
  • ఇందులోని ‘వీరా రాజా వీరా’ పాటను ‘శివస్తుతి’ నుంచి కాపీ చేశారని పిటిషనర్ ఫిర్యాదు
  • నిన్న మధ్యంతర తీర్పు వెలువరించిన న్యాయస్థానం
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ 2’ సినిమా 2023లో విడుదలైంది. ఇందులో విక్రమ్, రవిమోహన్, కార్తి, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 

ఈ మూవీలోని ‘వీరా రాజా వీరా’ పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్టు గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న మధ్యంతర తీర్పు వెలువడింది. పిటిషనర్‌కు రూ. 2 కోట్లు చెల్లించడంతోపాటు సినిమాలో ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌ను ఆదేశించింది.
A.R. Rahman
Ponniyin Selvan 2
Delhi High Court
Copyright Infringement
Music Plagiarism
Madras Talkies
Ustad Faiyaz Wasifuddin Dagar
Veera Raja Veera Song
Indian Film Music

More Telugu News