Hafiz Saeed: నీళ్లు ఆపేస్తే ఊరుకుంటామా... నీ శ్వాస ఆపేస్తాం... హిందువుల రక్తం పారిస్తాం: ప్రధాని మోదీకి హఫీజ్ సయీద్ వార్నింగ్

Hafiz Saeeds Threat to Modi Stop Water Well Stop Your Breath
  • ఇస్లామాబాద్ సభలో హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు
  • పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతావా అంటూ మండిపాటు
  • కశ్మీర్‌లో డ్యాం కట్టి నీళ్లు ఆపితే మేం ఊరుకుంటామా అని ఆగ్రహం
"నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం. కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారిస్తాం. యుద్ధం మొదలు పెడతాం. మీ అంతు చూస్తాం" అంటూ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సభలో అతడు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా, మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హఫీజ్ సయీద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హెచ్చరించాడు. సింధూ నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేం బంగ్లాదేశ్‌ను విడదీశామని ఢాకాలో నిలబడి చెబుతున్నారా? అని మోదీపై ధ్వజమెత్తాడు.

ఇందుకోసం నువ్వూ రక్తం ఇచ్చావని చెబుతున్నావ్ కదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. మేం మౌనంగా ఉండేది లేదని, నువ్వు అంటే మేమూ అంటామని హఫీజ్ సయీద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. కశ్మీర్‌లో డ్యాం కట్టి పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా, మేం ఊరుకుంటామని అనుకుంటున్నారా? అని మండిపడ్డాడు.
Hafiz Saeed
India-Pakistan relations
Kashmir issue
Narendra Modi
Terrorism
Nuclear threat
Water dispute
Sindhu River
Lashkar-e-Taiba

More Telugu News