Boduppal: బోడుప్పల్ లో ఆక్రమణల కూల్చివేత

Boduppal Encroachments Demolished
--
బోడుప్పల్ లో రోడ్డు ఆక్రమణలపై మున్సిపల్ కమిషనర్ శైలజ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును ఆక్రమించి కట్టిన గోడను బుల్డోజర్ తో కూల్చివేయించారు. అధికారుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఓ రోడ్డును ఆక్రమించి విజన్ పీజీ కళాశాల యాజమాన్యం భవనం నిర్మించింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శైలజ స్పందించారు.

కాలనీని పరిశీలించి రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించారు. పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ శైలజ స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు, షెడ్డు నిర్మాణాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు టౌన్ ప్లానర్ కావ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Boduppal
Municipal Commissioner
Shailaja
Encroachments Demolition
Road Encroachment
Illegal Construction
RNS Colony
Vision PG College
Building Demolition
Telangana

More Telugu News