Virat Kohli: టీ20ల్లో స‌రికొత్త రికార్డు.. బాబ‌ర్‌ను వెన‌క్కి నెట్టిన కోహ్లీ!

Virat Kohli Breaks Babar Azams T20 Record
  • టీ20ల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌మ‌యంలో అత్య‌ధిక సార్లు 50+ ర‌న్స్ చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లీ
  • ఇప్ప‌టివ‌ర‌కు ఇలా 61 సార్లు 50+ ప‌రుగులు చేసిన ర‌న్ మెషీన్‌
  • నిన్న రాజ‌స్థాన్ తో మ్యాచ్‌లో అర్ధ‌శ‌త‌కం చేయ‌డం ద్వారా ఈ అరుదైన రికార్డు
  • ఈ క్ర‌మంలో పాక్‌ స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజాం (61)ను అధిగ‌మించిన విరాట్‌
  • ఒకే స్టేడియంలో 3,500 ప‌రుగులు.. కోహ్లీ మ‌రో రికార్డు!
టీ20ల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌మ‌యంలో అత్య‌ధిక సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు ర‌న్ మెషీన్ ఇలా 61 సార్లు 50+ ప‌రుగులు చేశాడు. నిన్న చిన్న‌స్వామి స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అర్ధ‌శ‌త‌కం చేయ‌డం ద్వారా ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజాం (61)ను విరాట్ వెన‌క్కి నెట్టాడు. 

ఆ త‌ర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (57), డేవిడ్ వార్న‌ర్ (55), జాస్ బ‌ట్ల‌ర్ (52), ఫాఫ్ డుప్లెసిస్ (52) ఉన్నారు. ఇక, నిన్న‌టి రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అందులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 166.67గా ఉండ‌డం విశేషం. 

ఒకే స్టేడియంలో 3500 ప‌రుగులు.. కోహ్లీ రికార్డు!
టీ20ల్లో విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరున లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒకే వేదిక‌లో 3500 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ నిలిచాడు. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ర‌న్ మెషీన్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ స్టార్ ప్లేయ‌ర్ ముష్ఫీక‌ర్ ర‌హీమ్ (మీర్పూర్-3373) రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వీరిద్ద‌రి త‌ర్వాత జేమ్స్ విన్స్ (3,253-సౌతాంప్ట‌న్‌), అలెక్స్ హేల్స్ (3241-నాటింగ్‌హామ్‌), త‌మీమ్ ఇక్బాల్ (3238-మీర్పూర్‌) ఉన్నారు.  


Virat Kohli
T20 Records
Cricket Records
Babar Azam
Chris Gayle
David Warner
IPL
Royal Challengers Bangalore
Chinnswamy Stadium
Run Machine

More Telugu News