DC vs GT: దంచి కొట్టిన ఢిల్లీ... గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్‌

Delhi Capitals Set Huge Target for Gujarat Titans in IPL Match
  • అహ్మ‌దాబాద్ వేదిక‌గా డీసీ, జీటీ మ్యాచ్‌
  • తొలుత బ్యాటింగ్ చేసి 203 ప‌రుగుల భారీ స్కోర్ బాదిన ఢిల్లీ
  • రాణించిన అక్ష‌ర్‌, అశుతోశ్‌, క‌రుణ్, రాహుల్‌
  • నాలుగు వికెట్లు ప‌డగొట్టిన ప్ర‌సిద్ధ్ కృష్ణ‌
ఈరోజు ఐపీఎల్‌లో డ‌బుల్ ధ‌మాకా ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ), గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొద‌ట టాస్ గెలిచిన గుజ‌రాత్ బౌలింగ్ ఎంచుకుంది. 

దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్‌కు 204 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డీసీ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ 39, అశుతోశ్ శ‌ర్మ 37, క‌రుణ్ నాయ‌ర్ 31, స్ట‌బ్స్ 31, కేఎల్ రాహుల్ 28 ప‌రుగులు చేశారు. జీటీ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీయ‌గా... సిరాజ్‌, అర్ష‌ద్ ఖాన్‌, ఇషాంత్ శ‌ర్మ‌, సాయి కిశోర్ తలో వికెట్ ప‌డ‌గొట్టారు. 

కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరు మ్యాచ్ లు ఆడి, 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు గుజ‌రాత్ ఆరింటిలో నాలుగు విజ‌యాల‌తో మూడో స్థానంలో ఉంది. 
DC vs GT
Delhi Capitals
Gujarat Titans
IPL 2023
Axar Patel
Shubman Gill
Ahmedabad
Cricket Match
IPL Score
Indian Premier League

More Telugu News