Google Maps: గూగుల్ మ్యాప్స్ ను నమ్మితే ఒక్కోసారి ఇలాంటి లాంగ్ జంప్ లు తప్పవు!

Google Maps Fail Leads to Indonesian Couples Dramatic Car Plunge
 
గూగుల్ మ్యాప్స్... సాంకేతికంగా చూస్తే ఎంతో గొప్ప ఆవిష్కరణ. ఎక్కడో రోదసిలో ఉండే శాటిలైట్లు... భూమి మీద ఉండే వారికి దారి చూపిస్తుండడం మామూలు విషయం కాదు. అయితే, టెక్నాలజీ అన్నాక లోపాలు ఉండడం సహజమే. గూగుల్ మ్యాప్స్ కూడా అందుకు మినహాయింపు కాదు. 

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మితే... ఒక్కోసారి గమ్యస్థానానికి బదులు మరెక్కడికో తీసుకువెళుతుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయిన వాళ్లు చెరువుల్లోకి, అడవుల్లోకి కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. అంతెందుకు సగం నిర్మించిన రోడ్లపైనా ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. ఈ ఘటన కూడా అలాంటిదే. 

ఇండోనేషియాలో ఓ దంపతులు తమ ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యారు. కొద్ది దూరం ప్రయాణం చేశాక... వారి బీఎండబ్ల్యూ కారు ఓ బ్రిడ్జిపైకి వెళ్లింది. ఇంకాస్త ముందుకు వెళ్లాక ఒక్కసారిగా వారి కారు కిందికి పడిపోయింది. ఆ బ్రిడ్జి సగం కట్టి  ఉండడమే అందుకు కారణం. ఆ కారు కింద ఉన్న ఓ రోడ్డుపైకి లాంగ్ జంప్ చేసినట్టుగా పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఇండోనేషియా దంపతులు ఓ మోస్తరు దెబ్బలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Google Maps
Indonesia
Accident
Navigation App
GPS Errors
Bridge Collapse
Car Crash
Technology Failure
Travel Safety
Map Navigation

More Telugu News