Road Accident: క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం... న‌లుగురు ఏపీ వాసుల దుర్మ‌ర‌ణం!

Four Andhra Pradesh Residents Killed in Horrific Karnataka Road Accident
   
క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో న‌లుగురు ఏపీ వాసులు దుర్మ‌ర‌ణం చెందారు. వంతెన గోడ‌ను వాహ‌నం బ‌లంగా ఢీకొట్ట‌డంతో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులంద‌రూ హిందూపురానికి చెందిన‌వారే. మృతుల‌ను నాగ‌రాజు, నాగ‌భూష‌ణ్, సోమ‌, ముర‌ళిగా గుర్తించారు. 

వీరు హిందూపురం నుంచి క‌ర్ణాట‌క‌లోని యాద్గిర్ జిల్లా ష‌హ‌ర్‌పూర్ వెళుతుండగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఆనంద్‌ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గబ్బూర్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Road Accident
Karnataka
Andhra Pradesh
Hindupur
Yadgir
Shahpur
Nagabhushan
Soma
Murali

More Telugu News