Mohanlal: ఓటీటీలోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్... ఎప్పుడు, ఎక్కడంటే...!

L2 Empuraan OTT Release Date Announced
 
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. ఇది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 24 నుంచి ఎల్2: ఎంపురాన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అలరించనుంది. 

గతంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ కు సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్  తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
Mohanlal
L2 Empuraan
Prithviraj Sukumaran
Malayalam Movie
OTT Release
Geo Hotstar
April 24 Release
Box Office Hit
Lucifer Sequel
South Indian Cinema

More Telugu News