KA Paul: కేఏ పాల్ పిటిషన్... ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

CBI Probe Demanded in Pastor Praveen Death Case KA Pauls Plea
  • పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కేఏ పాల్ పిటిషన్
  • ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదన్న పాల్
  • కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే ప్రవీణ్ చనిపోయారంటూ సీసీ కెమెరాల ఫుటేజీతో సహా పోలీసులు చెబుతున్నా... క్రైస్తవ సంఘాలు ఈ ఘటనపై ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ప్రవీణ్ ను హత్య చేసి చంపేశారని పిటిషన్ లో కేఏ పాల్ ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ తన వాదనలు వినిపించారు. పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలని వాదించారు. మృతి ఘటనపై ఎవరూ మాట్లడవద్దని స్థానిక ఎస్పీ అందరినీ బెదిరించారని చెప్పారు. ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదని అన్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మృతిని రోడ్డు ప్రమాదంగా పోలీసులు ప్రకటించిన తర్వాత... సీబీఐ విచారణ కోసం హైకోర్టును కేఏ పాల్ ఆశ్రయించడం గమనార్హం. 
KA Paul
Pastor Praveen's Death
AP High Court
CBI Inquiry
Road Accident
Murder Allegations
Andhra Pradesh
PIL
Police Investigation
Praveen's Postmortem

More Telugu News