తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరగొచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక
--
సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయొచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేసింది. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న సమయంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం.