Draupadi Murmu: 25 ఏళ్ల తర్వాత ఆ దేశాలకు భారత రాష్ట్రపతి

Indias President Embarks on Historic Portugal and Slovakia Trip
  • పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • 25 సంవత్సరాల తర్వాత ఆ దేశాలకు భారత రాష్ట్రపతి ఆ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటి సారన్న విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి 
  • లిస్బన్ – భారత్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముర్ము పోర్చుగల్ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఆదివారం 'ఎక్స్' వేదికగా తెలియజేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లొవేకియా దేశాల అధికారిక పర్యటనకు బయలుదేరారని ఆయన తెలిపారు. 25 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనతో రెండు దేశాలతో బహుముఖ సహకారం మరింతగా విస్తరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్-పోర్చుగల్ దౌత్య సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్రౌపది ముర్ము లిస్బన్‌లో పర్యటించనున్నారు.
Draupadi Murmu
India President Portugal Visit
India President Slovakia Visit
India-Portugal Relations
India-Slovakia Relations
Bilateral Cooperation
State Visit
President Murmu
25 years after

More Telugu News