Donald Trump: బ్లడ్ బాత్... ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కుదేలు... 2,500 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్

Bloodbath in Stock Market Sensex Crashes Over 2500 Points Due to Trumps Impact
  • ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్స్
  • ప్రపంచ వ్యాప్తంగా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు
  • 22 వేలకు పడిపోయిన నిష్టీ
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ల ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 2,500 పాయింట్లకు పైగా పతనమయింది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 2,518 పాయింట్లు కోల్పోయి 72,845 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 22,076 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ మూడున్నర శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 9 శాతం, టాటా మోటార్స్ 8.61 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 6.29 శాతం, టెక్ మహీంద్రా 5.87 శాతం, ఎల్ అండ్ టీ 5.56 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ 5.39 శాతం, రియాల్టీ 4.34 శాతం, టెక్ 4.23 శాతం పతనమయ్యాయి.
Donald Trump
Stock Market Crash
Sensex
Nifty
Global Market
Tariff War
India Stock Market
Market Decline
Economic Crisis

More Telugu News