Jatin Hukkeri: ఇక ఆమెతో సంసారం చేయలేను .. విడాకులకు సిద్దమైన రన్యారావు భర్త జతిన్

Jatin Hukkeri Files for Divorce from Actress Ranya Rao
  • బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైయిన నటి రన్యారావు
  • అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిన రన్యారావు, తరుణ్‌ల అక్రమ వ్యాపారం 
  • వివాహమైన నెల రోజులకే రన్యారావు, జతిన్ మధ్య మనస్పర్ధలు
  • కేసు నేపథ్యంలో రన్యారావు నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్దమైన జతిన్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు భర్త జతిన్ హుక్కురి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది ద్వారా రన్యారావు నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ జతిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీన రన్యారావు, జతిన్‌లకు వివాహం జరిగింది. అనంతరం లావెల్లీ రోడ్డులోని ఒక ఖరీదైన ఫ్లాట్‌లో వీరు సంసారాన్ని మొదలు పెట్టారు. అయితే నెల రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని ప్రతిసారి ఆమె తరచు దుబాయ్‌కి వెళ్లి వస్తుండటంతో ఆమె నుంచి జతిన్ దూరంగా ఉంటున్నారు.

ఈ ఏడాది మార్చి 2వ తేదీ అర్ధరాత్రి రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో వీరి అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జతిన్‌ను డీఆర్ఐ అధికారులు విచారించగా, బంగారం స్మగ్లింగ్‌లో అతని ప్రమేయం ఏమీ లేదని తేలడంతో వదిలివేశారు. ఈ కేసు నుండి బయటపడినా ఇక ఆమెతో కలిసి ఉండటం కుదరదని భావించిన జతిన్ బెంగళూరులోని ప్రముఖ న్యాయవాది ప్రభులింగ నావడగి ద్వారా విడాకుల పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయడానికి సిద్ధం చేసుకున్నారు. 
Jatin Hukkeri
Ranya Rao
Divorce
Gold Smuggling Case
DRI Arrest
Celebrity Divorce
Indian Actress
Legal Proceedings
Marriage
Bengaluru Lawyer

More Telugu News