Forbes Billionaire List 2025: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా విడుద‌ల‌... అదానీ, అంబానీలు ఏ స్థానంలో ఉన్నారంటే..!

Forbes 2025 Billionaire List Ambani and Adanis Rankings Revealed
  • ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందన్న‌ ఫోర్బ్స్‌
  • ప్ర‌పంచ‌ బిలియనీర్ల సమిష్టి సంపద 16.1 ట్రిలియన్ డాల‌ర్లు
  • మ‌ళ్లీ అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకున్న ఎలాన్ మ‌స్క్‌
  • జాబితాలో ముకేశ్‌ అంబానీకి 18వ స్థానం.. 28వ స్థానంలో గౌతమ్‌ అదానీ
ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా-2025 విడుదలైంది. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గ‌తేడాది బిలియనీర్ల సంఖ్యతో పోలిస్తే 247 మంది ఎక్కువ. ప్ర‌పంచ‌ బిలియనీర్ల సమష్టి సంపద 16.1 ట్రిలియన్ డాల‌ర్లుగా పేర్కొంది. 2024తో పోలిస్తే 2 ట్రిలియన్ల డాల‌ర్ల సంప‌ద పెరిగిందని తెలిపింది. ఇక ర్యాంకింగ్స్‌లో అమెరికా 902 బిలియనీర్లతో అగ్ర‌స్థానంలో ఉంటే... ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా చైనా (516), ఇండియా (205) ఉన్నాయి.

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత‌ ముకేశ్‌ అంబానీ 92.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరో భారతీయుడు గౌతమ్‌ అదానీ 56.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 28వ స్థానానికి పడిపోయారు. 

కాగా, ఈ జాబితాలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకున్నారు. 342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో టాప్‌లో నిలిచారు. మస్క్‌ తర్వాత ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ బుకర్‌బర్గ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 216 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 215 బిలియన్‌ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు.

టాప్‌-10 ప్ర‌పంచ బిలియ‌నీర్ల జాబితా ఇదే...
ఎలాన్ మస్క్ (342 బిలియన్ డాల‌ర్లు) – టెస్లా, స్పేస్‌ఎక్స్ (అమెరికా) 
మార్క్ జుకర్‌బర్గ్ (216 బిలియన్ డాల‌ర్లు) – మెటా (అమెరికా)
జెఫ్ బెజోస్ (215 బిలియన్ డాల‌ర్లు) – అమెజాన్ (అమెరికా)  
లారీ ఎల్లిసన్ (192 బిలియన్ డాల‌ర్లు) – ఒరాకిల్ (అమెరికా) 
బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (178 బిలియన్ డాల‌ర్లు) – ఎల్‌వీఎంహెచ్‌ (ఫ్రాన్స్) 
వారెన్ బఫెట్ (154 బిలియన్ డాల‌ర్లు) – బెర్క్‌షైర్ హాత్వే (అమెరికా)  
లారీ పేజ్ (144 బిలియన్ డాల‌ర్లు) – గూగుల్ (అమెరికా)  
సెర్గీ బ్రిన్ (138 బిలియన్ డాల‌ర్లు) – గూగుల్ (అమెరికా) 
అమాన్సియో ఒర్టెగా (124 బిలియన్ డాల‌ర్లు) – జారా (స్పెయిన్)
స్టీవ్ బాల్మెర్ (118 బిలియన్ డాల‌ర్లు) – మైక్రోసాఫ్ట్ (అమెరికా)

జాబితాలో ఉన్న 10 మంది అత్యంత ధనవంతులైన భారతీయులు వీరే..
ముఖేశ్‌ అంబానీ (92.5 బిలియన్ డాల‌ర్లు)
గౌతమ్ అదానీ (56.3 బిలియన్ డాల‌ర్లు)
సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ (35.5 బిలియన్ డాల‌ర్లు)
శివ నాడార్ (34.5 బిలియన్ డాల‌ర్లు)
దిలీప్ సంఘ్వీ (24.9 బిలియన్ డాల‌ర్లు)
సైరస్ పూనావాలా (23.1 బిలియన్ డాల‌ర్లు)
కుమార్ బిర్లా (20.9 బిలియన్ డాల‌ర్లు)
లక్ష్మీ మిట్టల్ (19.2 బిలియన్ డాల‌ర్లు)
రాధాకిషన్ దమాని (15.4 బిలియన్ డాల‌ర్లు)
కుశాల్ పాల్ సింగ్ (14.5 బిలియన్ డాల‌ర్లు)
Forbes Billionaire List 2025
Elon Musk
Mukesh Ambani
Gautam Adani
Jeff Bezos
Mark Zuckerberg
World's Richest
Billionaire Net Worth
Top 10 Billionaires
Indian Billionaires

More Telugu News