Chandrababu Naidu: అర్ధాంగి భువనేశ్వరికి పట్టుచీర కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ధర ఎంతంటే ..?

Chandrababu Naidu Buys Silk Saree for Bhuvaneswari
  • బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • చీరాల పట్టు చీరలు చూసి ఆకర్షితుడైన చంద్రబాబు
  • రూ.12వేలు చెల్లించి పట్టుచీర కొనుగోలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం ఒక చేనేత కార్మికురాలి వద్ద పట్టుచీరను కొనుగోలు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెం గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు.

ఆయన చీరాల పట్టుచీరల శ్రేణిని ప్రత్యేకంగా పరిశీలించారు. జాండ్రపేటకు చెందిన చేనేత కార్మికురాలు, పొదుపు సంఘ సభ్యురాలు చింతం మయూరి వద్ద ఆయన తన భార్య భువనేశ్వరి కోసం రూ.12 వేలు చెల్లించి పట్టుచీరను కొన్నారు.

వ్యాపారం వృద్ధి చెందేలా చూసుకోవాలని, నెలకు కనీసం రూ.40 నుండి 50 వేల వరకు సంపాదించాలని చంద్రబాబు ఆమెకు సూచించారు. ముఖ్యమంత్రి స్వయంగా తన వద్ద పట్టుచీరను కొనుగోలు చేయడంతో చేనేత కార్మికురాలు చింతం మయూరి సంతోషం వ్యక్తం చేశారు. 
Chandrababu Naidu
Nara Bhuvaneswari
Handloom saree
Chinta Mayuri
Bapatla
Kotta Gollalapalem
Andhra Pradesh
Handloom weavers
DWACRA
Saree Purchase

More Telugu News