హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... అర్ధరాత్రి వరకు సేవలు
- నిన్నటి నుంచే అందుబాటులోకి సేవలు
- ఇక నుంచి అర్ధరాత్రి 12 గంటలకు కూడా ప్రయాణించే అవకాశం
- అర్ధరాత్రి విధులు ముగిసే వారికి, ఆ సమయంలో నగరానికి చేరుకునే దూర ప్రయాణికులకు ప్రయోజనకరం
రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధరాత్రి విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూరప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు, నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఛార్జీలను పెంచాలని మెట్రో ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.