Gummadavelli Renukha: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్య మృతి

Maoist Leader Sakhamuri Apparaos Wife Killed in Encounter
  • బీజాపూర్‌, దంతెవాడ సరిహద్దులో ఎన్‌కౌంటర్
  • రేణుక తలపై తెలంగాణలో రూ. 20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 25 లక్షల రివార్డులు
  • ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు, దివంగత కేంద్రకమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు భార్య, మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలైన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి మృతి చెందింది.

రేణుకపై తెలంగాణలో రూ. 20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 25 లక్షల రివార్డులున్నాయి. బీజాపూర్‌, దంతెవాడ సరిహద్దులోని ఇకేలీ బెలీనార్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు నిన్న కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో రేణుక మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 
Gummadavelli Renukha
Sakhamuri Apparao wife
Maoist Encounter
Chhattisgarh Encounter
Bhopalpatnam
Bijapur
Dantewada
naxal
woman maoist
Telangana Maoist

More Telugu News