తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ముంబై పోర్ట్ జోన్ డీసీపీ సుధాకర్ మృతి
- నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రబాద్ మండలంలో ప్రమాదం
- అధికారి ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించిన పోలీసులు
ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారిలో ఒకరిని మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారిగా గుర్తించారు. మరో వ్యక్తిని భగవత్‌గా గుర్తించారు.