Electric Car: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ

Maruti E Vitara and Tata Harrier 500 km Range EVs Coming Soon
  • ‘ఈ విటారా’ పేరుతో ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్న కంపెనీ
  • భారత మార్కెట్లో నమ్మకమైన కంపెనీగా మారుతి సుజుకీ
  • టాటా కంపెనీ నుంచి ‘హారియర్’ పేరుతో ఎలక్ట్రిక్ కారు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్ల విషయంలో బ్యాటరీ మన్నికపై వినియోగదారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీనిని గుర్తించిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మారుతి సుజుకీ సరికొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘ఈ విటారా’ పేరుతో తీసుకొస్తున్న ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించవచ్చని చెబుతోంది.

తయారీ తుది దశకు చేరుకుందని, ఈ ఏడాది చివరిలోగా ‘ఈ విటారా’ను మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు, భారత్ కు చెందిన టాటా కంపెనీ కూడా ఓ కొత్త ఈవీ కారును తీసుకురానుంది. టాటా హారియర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ కారులో 75 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. 

ఈ విటారా.. 
మారుతి సుజుకీ కంపెనీపై భారతీయులలో నమ్మకం ఎక్కువ. వినియోగదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే భారత్ లో తమ వినియోగదారుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా’ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.

హారియర్
భారతీయ కంపెనీల్లో టాటా కంపెనీ బ్రాండ్ కు సాటిరాగల కంపెనీ మరొకటి లేదనడంలో అతిశయోక్తి ఏమీలేదు. టాటా కార్లలో దాదాపు అన్నింటికీ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. తాజాగా టాటా నుంచి ‘హారియర్’ పేరుతో ఎలక్ట్రిక్ కారు రానుంది. ఇందులో 75కే డబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
Electric Car
500 km range
Maruti Suzuki
Electric Vehicle
EV
e-Vitara
Tata Harrier
Lithium-ion battery
India EV market
New Electric Car

More Telugu News