కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Modi Govt Announces DA Increase
  • ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ భేటీ
  • కేంద ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
  • తాజా పెంపుతో 53 నుంచి 55 శాతానికి పెరిగిన డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు నేడు వెల్లడించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. 

అటు, రూ.22,919 కోట్లతో పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం.
Go Back to Shorts
Narendra Modi
Central Government Employees
DA Hike
Dearness Allowance
PLI Scheme
Electronics Industry
Cabinet Meeting
India
Government Policies
Economic News

More Telugu News