మంత్రి నారా లోకేశ్ చొరవతో గుండెను తరలించేందుకు గ్రీన్ ఛానల్
- చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్
- అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
- గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలింపు
- ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్
గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రేణిగుంటకు, ఆపై తిరుపతిలోని ఆసుపత్రికి గుండెను తరలించారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం అవసరమైన గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం లోకేశ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు.
ఈ సందర్భంగా మృతురాలి భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ, తన భార్య అనారోగ్యం బారిన పడి కోమాలోకి వెళ్లారని, అవయవదానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సహకారంతో తిరుపతిలో ఉన్న వ్యక్తికి గుండెను అందించడం సంతృప్తిగా ఉందని అన్నారు.