Bangalore Professor Dance: మైఖెల్ జాక్సన్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన బెంగళూరు ప్రొఫెసర్.. వైరల్ వీడియో!

Bangalore Professors Michael Jackson Dance Goes Viral
  • చప్పట్లు, ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • రెండు లక్షల లైకులు, 27 లక్షల వ్యూస్
నిత్యం క్లాస్ రూమ్ లో సీరియస్ గా పాఠాలు బోధించే ఓ లెక్చరర్ సరదాగా స్టెప్పులేస్తే, అదికూడా మైఖెల్ జాక్సన్ పాటకు కాలుకదిపితే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఉంటుంది. అచ్చంగా మైఖెల్ జాక్సన్ దిగి వచ్చినట్లు తమ లెక్చరర్ డ్యాన్స్ చేయడం చూసి విద్యార్థులు ఉత్సాహం పట్టలేకపోయారు. క్లాస్ రూమ్ దద్దరిల్లిపోయేలా ఈలలు, చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. బెంగళూరులోని న్యూ హారిజాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ రవి చేసిన ఈ డ్యాన్స్ ను ఓ విద్యార్థి వీడియో తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు.

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దాదాపు 2 లక్షల మంది ఈ వీడియోకు లైక్ కొట్టగా.. 27 లక్షల మందికి పైగా వీక్షించారు. రవి సార్ జోష్ ఏమాత్రం తగ్గలేదంటూ ఆయన పూర్వ విద్యార్థులు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు, మంచి లెక్చరర్ కూడా అని, ఆయన శిష్యులు కావడం తమ అదృష్టమని కామెంట్లలో చెబుతున్నారు. మరో యూజర్ కాస్త ఫన్నీగా స్పందిస్తూ.. రవి సార్ క్లాస్ కు ఆ రోజు ఒక్క విద్యార్థి కూడా మిస్ అయి ఉండడని కామెంట్ చేశాడు.
Bangalore Professor Dance
Professor Ravi
Viral Video
Michael Jackson Dance
New Horizon College of Engineering
Viral
India
Professor
Lecturer

More Telugu News