Chandrababu Naidu: చంద్రబాబు వ్యక్తిత్వంపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

Nara Bhuvaneswaris Key Remarks on Chandrababu Naidus Personality
  • అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అతిధిగా హాజరయిన నారా భువనేశ్వరి
  • కుటుంబం అన్నది చంద్రబాబుకు రెండో ప్రాధాన్యత అన్న నారా భువనేశ్వరి
  • ఎవరి మీదా చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష ఉండదని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆయన వ్యక్తిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్‌ను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, లక్షలాది మంది జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తున్న ఈ పాఠశాల కోసం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1999లో 172 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు.

చంద్రబాబుతో తనకు వివాహం జరిగినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారని, పెళ్లయిన తర్వాత కూడా ఆయనకు కుటుంబం రెండో ప్రాధాన్యతగా ఉండేదని ఆమె అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే, తాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తామిద్దరం ప్రజలకు దగ్గరగా ఉంటున్నామని ఆమె చెప్పారు. ప్రజల సంతోషమే తమ ఆనందమని ఆమె అన్నారు.

చంద్రబాబు తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకుంటారని భువనేశ్వరి అన్నారు. ఆయనకు ఎవరి మీదా వ్యక్తిగత కక్ష ఉండదని, ఆ రోజు జరిగిన ఘటనలను ఆ రోజే మరచిపోయి రేపటి గురించి ఆలోచించే మనస్తత్వం ఆయనదని అన్నారు. జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన సానుకూలంగా తీసుకుంటారని చెప్పారు. ఆయన ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేస్తారని, పనిలో పడితే తిండి, నిద్ర గురించి మరచిపోతారని, వేరే వారు గుర్తు చేస్తేనే ఆయనకు గుర్తు వస్తుందని భువనేశ్వరి తెలిపారు. 
Chandrababu Naidu
Nara Bhuvaneswari
Personality
Political Life
Family Life
Agastya International Foundation School
Silver Jubilee
Public Service
Positive Attitude
Dedication

More Telugu News