Nara Bhuvaneswari: మహిళలతో కలిసి కోలాటం ఆడిన నారా భువనేశ్వరి .. వీడియో ఇదిగో

Nara Bhuvaneswari Plays Kolam with Women Watch the Viral Video
  • కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
  • గుడిపల్లి మండలం గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖి
  • మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వివరించిన భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి మహిళలతో కలిసి కోలాటం ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

నారా భువనేశ్వరి బుధవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు.

కొంతసేపు మహిళలతో కోలాటం ఆడి వారితో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను భువనేశ్వరి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. 
Nara Bhuvaneswari
Andhra Pradesh
Kuppam
Women Empowerment
Kolam Dance
Viral Video
Nara Chandrababu Naidu
Social Media
Gudipalli Mandal

More Telugu News