Andhra Pradesh Government: ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Andhra Pradesh Govt Announces Good News for Property Tax Arrears
  • వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ప్రకటించిన మున్సిపల్ శాఖ
  • ప్రజల నుంచి వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
  • కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని భావిస్తున్న ప్రభుత్వం
ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను బకాయిదారులకు రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పన్ను చెల్లించేవారికి వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. 

ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయంతో కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పన్ను బకాయి పడ్డవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Government
Property Tax
Tax Relief
AP Municipal Department
Interest Waiver
Property Tax Arrears
Government Order
50% Concession

More Telugu News