Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు రూ. 1,700 కోట్లు, నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy Exposes Telanganas Crushing Debt Burden
  • తెలంగాణ అప్పు రూ. 8.6 లక్షల కోట్లుగా ఉందన్న మహేశ్వర్ రెడ్డి
  • తెలంగాణలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ. 2.27 లక్షలు ఉందన్న బీజేపీ నేత
  • యూపీఏ హయాం కంటే ఎన్డీయే హయాంలో రాష్ట్రాలకు నిధుల వాటా పెరిగిందని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రుణభారం రూ. 2.27 లక్షలుగా ఉందని వెల్లడించారు.

ఇంత భారీ స్థాయిలో రుణాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ హయాం కంటే ఎన్డీయే హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాలకు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. 

యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 10 శాతం పెంచి 42 శాతానికి చేర్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాను పెంచినప్పటికీ విమర్శలు చేయడం సముచితం కాదని ఆయన హితవు పలికారు.
Alleti Maheshwar Reddy
Telangana Congress Government
Telangana Debt
Revanth Reddy
BJP
State Debt
Indian Politics
Telangana Economy
Financial Crisis
National Politics

More Telugu News