MF Hussain: ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

Most Expensive Indian Artwork MF Hussains Painting Sold for 118 Crores
  • 1950లలో ‘గ్రామయాత్ర’ పేరుతో చిత్రించిన ఎంఎఫ్ హుస్సేన్
  • ఈ నెల 19న న్యూయార్క్‌లోని క్రిస్టీలో వేలం
  • అమృతా షేర్‌గిల్ చిత్రం ‘ది స్టోరీ టెల్లర్’ రికార్డు బద్దలు
భారత్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రికార్డుస్థాయి ధర పలికింది. ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్ర కళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా రికార్డులకెక్కింది. హుస్సేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. న్యూయార్క్‌లోని క్రిస్టీలో ఈ నెల 19న ఈ వేలం నిర్వహించగా రికార్డుస్థాయి ధర పలికింది. ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రానికి 2023లో ముంబైలో నిర్వహించిన వేలంలో రూ. 61.8 కోట్ల ధర పలికింది. ఇప్పుడు హుస్సేన్ చిత్రం ఆ రికార్డును బద్దలుగొట్టి దేశ చిత్ర కళలో అత్యంత ఖరీదైన కళాఖండంగా నిలిచింది.

14 అడుగుల కాన్వాస్ కలిగి ఉన్న హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం.. అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.
MF Hussain
Gram Yatra
Painting
Auction
Record Price
Indian Art
Christie's
Amrita Sher-Gil
Artwork
118 Crores

More Telugu News