భారత్‌లో నాకు ఆ స్ఫూర్తి బాగా నచ్చింది.. నా హృదయానికి దగ్గరైంది: మిస్ వరల్డ్ క్రిస్టినా
- భారత్‌లో తనకు చాలా గొప్ప స్వాగతం లభించిందన్న మిస్ వరల్డ్
- తన హృదయంలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంటుందని వ్యాఖ్య
- ఎన్నో భాషలు ఉన్నా అందరూ ఐకమత్యంతో ఉండటం భారత్ స్ఫూర్తి అన్న క్రిస్టినా
- భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తి తనకు బాగా నచ్చిందన్న ప్రపంచ సుందరి
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... "ఎన్నో భాషలు ఉన్నా అందరూ ఐక్యంగా ఉండటం భారత్ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది. నా హృదయానికి దగ్గరైంది. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక" అని క్రిస్టినా అన్నారు. కాగా, ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో హైదరాబాద్ వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి.