KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

Telangana Budget 2024 KTRs Strong Criticism and Accusations
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చిందని విమర్శ
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామన్న కేటీఆర్
  • ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా ఉందని చురక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చేస్తుందని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా పదేళ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పేదల కష్టాలను తీర్చే విధంగా లేదని ఆయన అన్నారు. ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సంబంధించి అంకెలు ఎందుకు మారాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 
KTR
Telangana Budget
BRS
Revanth Reddy
Telangana Assembly
Financial Crisis
Loan Waiver
Budget Criticism
Delhi
Election Promises

More Telugu News