ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటోలను పంచుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
- ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఫొటో షూట్
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా హాజరయ్యారన్న రఘురామకృష్ణరాజు
- నెట్టింట ఫొటోల సందడి
ఇది ప్రజాస్వామ్య ప్రయాణానికి గుర్తుగా, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రత్యేక ఫొటో సెషన్ లో పాల్గొన్నారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ ఫొటోలో ప్రతిబింబించిన ఐక్యత, బాధ్యత, ప్రజలకు అందించే సేవల పట్ల నిబద్ధత మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అటు, ఎమ్మెల్సీలతోనూ చంద్రబాబు, పవన్, లోకేశ్ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫొటోలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు.


