Tamil Nadu BJP Chief Annamalai: విజయ్ ను టార్గెట్ చేసిన అన్నామలై

tamil nadu bjp chief annamalai criticizes tvk party president vijay
  • టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు 
  • డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాతో విజయ్ టీవికే పార్టీ పని చేస్తోందని ఆరోపణ
  • ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయడం అంటే షూటింగ్ చేస్తూ ఓ లెటర్ రాసి పంపడం కాదని వ్యాఖ్య
టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. విజయ్‌కి 50 ఏళ్లు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా అని ప్రశ్నించారు. 30 ఏళ్ల వయసులో విజయ్ ఎక్కడ ఉన్నాడు ? ఏమి చేశాడని నిలదీశారు.

డ్రామాలు ఆడుతున్నది విజయ్..బీజేపీ కాదని అన్నామలై అన్నారు. డీఎంకే పార్టీకి విజయ పార్టీ బీ టీమ్ అని విమర్శించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాలో భాగంగా విజయ్ టీవికే పార్టీ పని చేస్తోందని అన్నారు.

విజయ్ పరిధి దాటి మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. విజయ్‌కి చేతనైతే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని, షూటింగ్ చేస్తూ ఓ లెటర్ రాసి పంపడం కాదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి విజయ్‌కు ఏమి తెలుసని అన్నామలై ప్రశ్నించారు.  
Tamil Nadu BJP Chief Annamalai
tvk party
Actor vijay

More Telugu News