వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం... పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
- టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం
- సతీసమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికిన అర్చకులు
సీఎం చంద్రబాబు శ్రీనివాస కల్యాణోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం చంద్రబాబుకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందించారు. కాగా, ఈ వేడుకను తిలకించేందుకు రాజధాని పరిసర గ్రామాల నుంచి 30 వేల మంది వరకు భక్తులు వచ్చారు. వారికి టీటీడీ లడ్డూ ప్రసాదం అందించింది.





