Samantha: నిర్మాతగా మారిన సమంత.. తొలి సినిమా విడుదలకు రెడీ

Samantha turns producer ready for her first film release
  • నిర్మాతగా మారిన సమంత 
  • శుభం పేరుతో తొలి సినిమా నిర్మాణం
  • త్వరలోనే థియేటర్స్‌లో విడుదల
ప్రముఖ కథానాయిక సమంత గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలేవీ సెట్స్‌ మీద లేవు. తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషీ' తరువాత ఆమె మరో చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ కథానాయిక తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో కొత్త ప్రాజెక్టులు అంగీకరించనుందని సమాచారం. ఇదిలా ఉండగా సమంత నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

తన సొంత నిర్మాణ సంస్థ  ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో తొలి ప్రాజెక్ట్‌గా 'శుభం' పేరుతో ఓ తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. వసంత్‌ మరిగంటి అందించిన కథతో సినిమా బండి ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు ఈ చిత్రంలో పలు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయని యూనిట్‌ చెబుతోంది. సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణిలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. 

త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్‌ సుజిత్‌సేన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా రామ్‌చరణ్ తేజ్‌, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్‌లు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 


Samantha
Shubam
Samantha prabhu
Tralala Moving Pictures
Samantha latest movies
Samantha news

More Telugu News