Gold Rates: బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

Gold Rates Touches Rs 90 Thousand Mark In Indian Market
  • దేశీయ మార్కెట్లో రూ. 90 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
  • రూ. లక్ష దాటిన కిలో వెండి ధర
  • అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులే కారణం
గత కొంతకాలంగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ. 90 వేలు దాటింది. పసిడితోపాటు పెరిగే వెండి కిలో ధర రూ. 1.03 లక్షలకు చేరింది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. 

అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపైకి పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ. 2,983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ. 90,450కి చేరుకుంది. కిలో వెండి ధర రూ. 1,03 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. 
Gold Rates
Silver Rates
Bullion Market
Business News

More Telugu News