Yuzvendra Chahal: అవకాశం ఉందా?: రికీ పాంటింగ్‌కు యుజ్వేంద్ర చాహల్ వీడియో సందేశం

Yuzvendra Chahal Shares Hilarious Reel Ahead Of IPL 2025
  • ఓపెనర్ అవసరమనుకుంటే తనను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా? అంటూ పాంటింగ్‌కు ప్రశ్న
  • ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన చాహల్
తమ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఓ సందేశాన్ని పంపించారు. జట్టుకు ఓపెనర్ అవసరమనుకుంటే తనను పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు వీడియోను విడుదల చేశాడు. ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా> అంటూ రికీ పాంటింగ్‌ను ఉద్దేశించి వీడియో పోస్టు చేశాడు.

ఐపీఎల్-2025 సీజన్ కోసం యజ్వేంద్ర చాహల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌కు వెళుతూ రికీ పాటింగ్‌ను బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆడగడం అందులో ఉంది. గత ఐపీఎల్‌లో రూ. 18 కోట్లు పెట్టి చాహల్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
Yuzvendra Chahal
Cricket
IPL 2025

More Telugu News