Tirupati: తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం

hotel roof collapses in tirupati
  • తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్‌లో కూలిన సీలింగ్
  • భయంతో బయటకు పరుగులు తీసిన కస్టమర్లు 
  • పోలీసులు హోటల్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేసిన వైనం
తిరుపతి బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం జరిగింది. హోటల్‌లోని రూమ్ నెం.314లో  పీవోపీతో చేసిన సీలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. ఈ హఠాత్పరిణామంతో హోటల్ గదుల్లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. 

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హోటల్‌లో ఉన్న వారిని వేరే చోటకు తరలించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Tirupati
Hotel Roof Collapses
Andhra Pradesh

More Telugu News