AP Assembly Session: శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Speaker Ayyanna Patrudu allows Sarath Chandra IAS Academy students into Assembly hall
 
శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి చెందిన 100 మంది విద్యార్థులకు అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి కీలక అంశాలను గమనించి, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో జరుగుతున్న చర్చలు, మంత్రుల సమాధానాలు, సభ్యుల వాదోపవాదాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశాన్ని విద్యార్థులు పొందుతారని వివరించారు. 

ఈ సందర్భంగా పావని అనే విద్యార్థిని... అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని వెల్లడించిందని... ఇప్పటివరకు టీవీలో మాత్రమే అసెంబ్లీ సమావేశాలు చూశానని, ఇప్పుడు స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిందని అయ్యన్నపాత్రుడు వివరించారు. 

మరో విద్యార్థిని మదీనా... వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను సభలో ప్రస్తావించగా, వాటి గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందని వెల్లడించిందని, తాము సివిల్స్ లక్ష్యంగా చదువుతున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తమకు కృతజ్ఞతలు తెలిపిందని అయ్యన్నపాత్రుడు వివరించారు.
AP Assembly Session
Ayyanna Patrudu
Students
Sarath Chandra IAS Academy

More Telugu News