ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి తమ్మయ్య బాబుపై సస్పెన్షన్ వేటు
- ప్రభుత్వాసుపత్రిలో వీరంగం వేసిన తమ్మయ్య బాబు
- విధుల్లో ఉన్న వైద్యురాలిపై చిందులు
- తీవ్రంగా పరిగణించిన జనసేన హైకమాండ్
- డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమంటూ ప్రకటన విడుదల
ప్రత్తిపాడు సీహెచ్ సీ ఘటనపై అందిన నివేదికలు, వివరణలను పరిగణనలోకి తీసుకుని తమ్మయ్య బాబును సస్పెండ్ చేసినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రత్తిపాడు సీహెచ్ సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరం అని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఈ ఘటనపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.