Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: న్యూజిలాండ్ ను దెబ్బకొట్టిన కుల్దీప్ యాదవ్

Kuldeep Yadav claims two wickets against New Zealand
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • రెండు కీలక వికెట్లు తీసిన కుల్దీప్ 
  • కివీస్ స్కోరు 16 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు
టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరైన సమయంలో వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. ఇవాళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ లో జరుగుతున్న ఈ పోరులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఓ దశలో న్యూజిలాండ్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 69 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్నప్పుడు కుల్దీప్ విజృంభించి రెండు వికెట్లు తీశాడు. తొలుత ధాటిగా ఆడుతున్న ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)న అవుట్ చేసిన కుల్దీప్.. తన తర్వాతి ఓవర్లో కేన్ విలియమ్సన్ (11) ను పెవిలియన్ కు పంపాడు. దాంతో కివీస్ దూకుడుకు కళ్లెం పడింది. 

ప్రస్తుతం కివీస్ స్కోరు 16 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు. డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్ విల్ యంగ్ (15) వికెట్ ను వరుణ్ చక్రవర్తి పడగొట్టాడు.
Team India
New Zealand
Kuldeep Yadav
Final
Champions Trophy 2025
Dubai

More Telugu News