Champions Trophy 2025: భారత జట్టు విజయం కోసం గణపురం గ్రామస్థుల ప్రార్థనలు... వీడియో ఇదిగో!

Villagers Offers Special Prayers In Temple For Indian Cricket Team Victory
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఫైనల్లో గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్థులు స్థానిక ఆలయంలో భారత జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాన్ని త్రివర్ణ ప్రతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఈ సందర్భంగా స్వామి వారిని కోరుకున్నట్లు పూజారి తెలిపారు.

Champions Trophy 2025
India
New zealand
Final Match
Temple
Prayers
Ganapuram

More Telugu News