Chandrababu: అర్ధాంగి భువనేశ్వరి కోసం మార్కాపురంలో బేరం ఆడి చీర కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu bought a Saree for his wife Bhuvaneswari in Markapuram
  • ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • డ్వాక్రా మహిళల స్టాల్స్ సందర్శన
  • మహిళలు తయారు చేసిన వస్తువుల పరిశీలన
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. 

ఓ చీరల స్టాల్ ను కూడా సందర్శించిన చంద్రబాబు... తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం ఓ పట్టుచీర కొనుగోలు చేశారు. ఎంతకు అమ్ముతున్నావమ్మా ఈ చీర? అంటూ స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. అందుకు ఆ మహిళ బదులిస్తూ... రూ.26,400 అని చెప్పింది. చివరికి చంద్రబాబు ఆ చీరను రూ.25 వేలకు బేరం ఆడి కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్టాల్లో మంగళగిరి పట్టుచీరలు కూడా ఉండడాన్ని ఆసక్తిగా పరిశీలించారు. షర్టు, పంచె, కండువా సెట్ ను కూడా పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు.
Chandrababu
Nara Bhuvaneswari
Saree
Markapuram

More Telugu News