Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం

Teegala Krishna Reddy grandson died in a road accident
 
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ నగర శివార్లలోని గొల్లపల్లి కలాన్ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కనిష్క్ రెడ్డిని అటుగా వెళుతున్న వారు ఆసుపత్రికి తరలించారు. 

తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించి కనిష్క్ రెడ్డి మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిష్క్ రెడ్డి తల్లి తీగల సునరిత రెడ్డి మూసారాం బాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్.
Teegala Krishna Reddy
Kanishk Reddy
Road Accident

More Telugu News