Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు... కానీ బయటకు రాలేని పరిస్థితి... కారణం ఇదే!

Kadapa mobile court grants bail to Posani Krishna Murali
  • ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో బెయిల్
  • నరసరావుపేట, ఆదోని కోర్టుల్లో కూడా బెయిల్ వస్తేనే బయటకు వచ్చే అవకాశం
  • లేకపోతే పైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి!
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా జైలుకే పరిమితమవుతారు. ఆయన పైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.
Posani Krishna Murali
Tollywood
Bollywood
Bail

More Telugu News