10th Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలు... నేటి నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు

Telangana 10th class hall tickes avilable in website
  • మార్చి 21న ప్రారంభంకానున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్
  • ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు
  • bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
ఈ నెల 21వ తేదీన తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 

విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నారు. bse.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి... పేరు, పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 24 – ఇంగ్లీష్‌
  • మార్చి 26 – మ్యాథ్స్‌
  • మార్చి 28 – ఫిజిక్స్‌
  • మార్చి 29 – బయాలజీ
  • ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌
10th Exams
Telangana
Hall Tickets

More Telugu News