Saud Shakeel: నిద్రపోయి ఔటైన పాకిస్థాన్ బ్యాటర్ షకీల్.. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా చెత్త రికార్డు

Saud Shakeel becomes first Pakistan player to get timed out after oversleeping
  • దేశవాళీ టోర్నీలో ఘటన
  • రంజాన్ సందర్భంగా రాత్రి 7.30 నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు మ్యాచ్
  • ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా ఔటైన ఏడో బ్యాటర్‌గా షకీల్ పేరిట అవాంఛిత రికార్డు
పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అనూహ్యంగా ఔటయ్యాడు. ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్ అతడిని టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించారు. 

మంగళవారం పీటీవీతో జరిగిన మ్యాచ్‌లో షకీల్ స్టేట్ బ్యాంకు తరపున బరిలోకి దిగాడు. రంజాన్ మాసం కావడంతో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు మ్యాచ్ నిర్వహించారు. పేసర్ మహ్మద్ షాజాద్ రెండు వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను పెవిలియన్ పంపాడు. 

ఈ క్రమంలో మూడు నిమిషాల్లోపు మరో బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉండగా షకీల్ ఆ వ్యవధి దాటిన తర్వాత క్రీజులోకి వచ్చి గార్డ్ తీసుకున్నాడు. అయితే, పీటీవీ కెప్టెన్ అమ్మాద్ బట్ అప్పీల్ చేయడంతో షకీల్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా టైమ్‌డ్ ఔట్ అయిన ఏడో బ్యాటర్‌గా, పాక్ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడిగా షకీల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
Saud Shakeel
Pakistan
Timed Out

More Telugu News