SLBC: ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుండి రెండు జాగిలాలు
- కేరళ నుండి ఆర్మీ హెలికాప్టర్లతో రెండు జాగిలాలను తీసుకొచ్చిన అధికారులు
- ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్న అధికారులు
- బురద, మట్టిని తొలగించేందుకు రంగంలోకి వాటర్ జెట్లు
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని కనుగొనేందుకు కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా రెండు క్యాడవర్ జాగిలాలను రప్పించారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమైంది. ఎనిమిది మంది ఉన్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద, మట్టి పేరుకుపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. వాటిని తొలగించేందుకు అధికారులు వాటర్ జెట్లను ఉపయోగిస్తున్నారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకొని పదమూడు రోజులు అవుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర సంస్థలకు చెందిన నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు.