Revanth Reddy: జానారెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy meets Jana Reddy
  • అరగంటకు పైగా ఇరువురి భేటీ
  • ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశంపై చర్చ
  • రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అరగంటకు పైగా వీరు భేటీ అయ్యారు. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.

మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 
Revanth Reddy
Congress
Jana Reddy
Telangana

More Telugu News