Chandrababu: సచివాలయం నుంచి ఇంటికి వెళుతుంటే చిట్ ఫండ్ బాధితులు వచ్చారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu shares a video of victims of a chit fund scam
  • సోషల్ మీడియాలో చంద్రబాబు ఆసక్తికర పోస్టు
  • సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసిందంటూ ట్వీట్
  • బాధితులంతా నరసరావుపేటకు చెందిన వారని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇవాళ తాను సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు చిట్ ఫండ్ బాధితులు వచ్చారని తెలిపారు. దాంతో వారి వద్దకు వెళ్లానని, వారంతా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందనివారని... సాయి సాధన అనే చిట్ ఫండ్ కంపెనీ తమను మోసం చేసిందని వాపోయారని చంద్రబాబు వివరించారు.

 "ఈ వ్యవహారంలో సుమారు 600 మంది నష్టపోయినట్టు తెలుస్తోంది. కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామన్న ఆవేదన వారి మాటల్లో కనిపించింది. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పాను. తప్పు చేసిన వారిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Chit Fund Scam
Narasaraopet

More Telugu News