పోసానిపై మరో కేసు... అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు
- పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించిన జైలు అధికారులు
- ఈ ఉదయం పీటీ వారెంట్లతో జైలుకు చేరుకున్న మూడు పీఎస్ ల పోలీసులు
- తాము కోర్టు అనుమతి తీసుకున్నామన్న నరసరావుపేట పోలీసులు
మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాలోచనలు చేశారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.